కోరుట్లలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు సురభి నవీన్ కుమార్
నవగీతం,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ మంగళవారం పట్టణంలో పలు సామాజిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గుండేటి నాగభూషణం మరియు వారి కుమారులు రాజశేఖర్ & బ్రదర్స్ నూతన గృహప్రవేశం బుధవారం జరగనున్న నేపథ్యంలో మంగళవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, ఉపాధ్యాయులు వనతడుపుల రవికుమార్ కుమారుడు రాఘవ వివాహం ఇటీవలే జరగడంతో, వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు....