కొరుట్ల,అక్టోబర్19,(నవగీతం)
కోరుట్ల పట్టణంలో బతుకమ్మ నిమజ్జన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జువ్వాడి కృష్ణ రావు తో పాటు కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మహిళా సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
