కోరుట్లలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

నవగీతం,కోరుట్ల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలో కేంద్ర విశ్వవిద్యాలయానికి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్ట తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల నిర్ణయాన్ని నిరసిస్తూ జగిత్యాల వైపు వెళ్తున్న కోరుట్ల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో  కలాల సాయి చందు, సొరుపాక రమేష్, గుగులోత్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు గిన్నెల అశోక్, చెట్పల్లి సాగర్, గుద్దేటి రాజేందర్, తోట నారాయణ, రుద్ర విఘ్నేష్,...