కోరుట్ల పబ్లిక్ స్కూల్‌కు ప్రతిష్టాత్మక ‘లీడ్ శిక్ష’ అవార్డు
సౌత్ జోన్ విజేతగా కెపిఎస్ ప్రభంజనం నవగీతం, కోరుట్ల ప్రతినిధి: హైదరాబాద్‌లోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో లీడ్ సంస్థ అత్యంత వైభవంగా నిర్వహించిన 'లీడ్ శిక్ష' అవార్డుల ప్రధానోత్సవంలో కోరుట్ల పబ్లిక్ స్కూల్ (కెపిఎస్) అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3000 లీడ్ పాఠశాలల పోటీలో కెపిఎస్ అత్యుత్తమ పనితీరును కనబరిచి, సౌత్ జోన్ స్థాయిలో "బెస్ట్ లీడ్ ఇంప్లిమెంటేషన్ స్కూల్" అవార్డును కైవసం చేసుకుంది. లీడ్ సీఈఓ సుమిత్ మెహ్రా, జోనల్ హెడ్ శ్రీకాంత్ మరియు ఏఈఎం ఐశ్వర్యల చేతుల...