కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల

100 పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి – ఎమ్మెల్యే డా. సంజయ్ జగిత్యాల/కొరుట్ల,అక్టోబర్ 28 (నవగీతం) కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు....