navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 11:15 pm Digital Edition : NAVAGEETAM

కోరుట్ల వారసత్వ సంపదను కాపాడండి: అడిషనల్ కలెక్టర్‌కు కౌన్సిలర్ల మొర

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల పట్టణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక గడి బురుజుల ఆక్రమణలను అరికట్టి, ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ కి (స్థానిక సంస్థలు) వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు పరాకాష్టకు చేరాయని, సంరక్షించాల్సిన అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై వత్తాసు పలకడం సరికాదని మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు అక్రమంగా విఎల్ టి నంబర్లు సృష్టిస్తున్నారని, పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే ప్రతాపం చూపే యంత్రాంగం,ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. పట్టణమంతా అనధికార లేఅవుట్లు వెలుస్తున్నా పట్టించుకోని వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కోరుట్ల వారసత్వ భూములను కాపాడాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పొట్ట సురేందర్, మోసిన్, వెంకటేష్ నాయకులు వినోద్, ఏలుగురి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.