కోరుట్ల వారసత్వ సంపదను కాపాడండి: అడిషనల్ కలెక్టర్‌కు కౌన్సిలర్ల మొర
నవగీతం ,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక గడి బురుజుల ఆక్రమణలను అరికట్టి, ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ కి (స్థానిక సంస్థలు) వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు పరాకాష్టకు చేరాయని, సంరక్షించాల్సిన అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై వత్తాసు పలకడం సరికాదని మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు అక్రమంగా విఎల్ టి నంబర్లు సృష్టిస్తున్నారని, పేదలు చిన్న ఇల్లు...