navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 1:47 am Digital Edition : NAVAGEETAM

కౌన్సిలర్ ను సన్మానించిన వాకర్స్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 22 వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ఆరవ లక్ష్మి రాజు లను మినిస్టేడియం వాకర్స్ సభ్యులు సన్మానించారు. అనంతరం మినిస్టేడియం సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ ఆరవ లక్ష్మి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య రక్షణే ద్యేయం గా ప్రతి రోజు ఎందరో పట్టణ పౌరులు మినిస్టేడియానికి వస్తుంటారని వీరందరి మేలు కోరడం తమ బాధ్యత అన్నారు. తన వంతుగా వాకర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమం లోఅధ్యక్షులు వెంకన్న, సెక్రటరీ శ్రీనివాస్ డైరెక్టర్ శ్రీనివాస్, మెంబెర్స్ వోరుగంటి ప్రభాకర్ రావు, రామానందం, వెంకటేష్ తోపాటు పలువురు ఉన్నారు.