navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 7:49 am Digital Edition : NAVAGEETAM

క్రాంతి కళాశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

నవగీతం,వైరా:

క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘాన్ని 1950లో ఏర్పాటు చేశారని ఆ తరువాత 2011 జనవరి 25 నుండి జాతీయ ఓట్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి ముఖ్యమైన బాధ్యత అని ఓటు ద్వారా మనం అర్హులైన నిజాయితీగల ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాము.ఆ రకంగా దేశ భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని నిజాయితీగల ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవాలి అన్నారు.అనంతరం ఎన్ఎస్ఎస్ పిఓ లింగారావు విద్యార్థుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్య  సంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ప్రిన్సిపల్ కృష్ణారావు, మజీద్, వేణు, చైతన్య అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.