navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 9:04 am Digital Edition : NAVAGEETAM

క్రాంతి కళాశాలలో ఘనంగా స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు

నవగీతం, వైరా

స్థానిక ఎస్ ఆర్ ఠాగూర్ విద్యా సంస్థలైన శ్రీ క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత , చైర్మన్ వాసిరెడ్డి సునీత నరేంద్ర దత్త చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.” రన్ ఫర్ స్వదేశీ” కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ వివేకానందుని రచనలు రాజయోగ, కర్మయోగ, జ్ఞాన యోగ,మొదలైన రచనల ద్వారా యువతను ఉత్తేజపరిచిన ఘనత స్వామి వివేకానందునిది అని అందుకే ఆయన జన్మదినాన్ని యువజన దినోత్సవం గా జరుపుకుంటున్నామని, ఆయన జీవిత విశేషాలను స్ఫూర్తిగా తీసుకుని వ్యక్తిగత విజయవంతంతో పాటుగా పరోక్షంగా దేశ సేవలో నిమగ్నమవాలని ఆ రకంగా యువత పటిష్టమైనటువంటి భవిష్యత్తును నిర్ణయించుకోవడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.యువజన దినోత్సవం సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు వివిధ విభాగాలలో క్రీడలు నిర్వహించారు. మంచి ప్రావీణ్యత, ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించి బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లింగారావు, ప్రిన్సిపల్ కృష్ణారావు, మజీద్ వేణు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.