navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 5:48 am Digital Edition : NAVAGEETAM

క్రీడలు ఆరోగ్యానికి మార్గం..

క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని కెవిఎస్ఆర్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మల్లాపూర్ ప్రీమియర్ లీగ్-4వ సీజన్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు .ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు, క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆరోగ్యానికి మార్గం అని వివరించారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. అందరూ కుల, మత, రాజకీయ భేదాలు పక్కనపెట్టి కలిసి మెలిసి ఉండాలని, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆటగాళ్లతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ప్రతి జట్టు స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌తో ఆడాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఆకాంక్షించారు.ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, ప్రాంచైజీలకు, క్రీడాకారులకు, నిర్వాహకులకు క్రీడాభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.