navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:25 am Digital Edition : NAVAGEETAM

క్షయ వ్యాధి నివారణపై అవగాహన

నవగీతం, మల్లాపూర్:

టీబీ ముక్త్ అభియాన్ లో భాగంగా మంగళవారం మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వాహిని ఆధ్వర్యంలో టీబీ (క్షయ) వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా డాక్టర్ వాహిని మాట్లాడుతూ..టీబీ వ్యాధిగ్రస్తులకు కేవలం మందులు మాత్రమే సరిపోవు. వారు త్వరగా కోలుకోవడానికి మంచి పౌష్టికాహారం అవసరం. చాలా మంది పేదరికం కారణంగా సరైన ఆహారం తీసుకోలేక వ్యాధి తీవ్రతకు గురవుతుంటారు. ఈ లోటును పూడ్చడమే ఈ అభియాన్ ఉద్దేశ్యం అని ప్రజలందరూ టీబీ వ్యాధిని సమాజం నుంచి పారదోలడానికి సహాయ సహకారాలు  అందించాలని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన పై అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలొ రామ్ మోహన్ సిహెచ్ఓ శకుంతల, సూపర్వైజర్ ఉమాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్వరి, ఫార్మసీ ఆఫీసర్ సుమలత, మధులత నర్సింగ్ అధికారులు శ్రీనివాస్, ఆరోగ్య సహాయకులు.గణేష్, జూనియర్ అసిస్టెంట్  వైద్య సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.