క్షయ వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ డియం అండ్ హెచ్ ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ , మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షయవ్యాధి (టిబి) పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, సమయానికి పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని...