navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 3:41 pm Digital Edition : NAVAGEETAM

ఖానాపూర్ లో ఇలాంటి బేకరీ షాప్ ప్రారంభించడం గొప్ప విషయం

బేకరీ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ రఘు

నవగీతం, ఖానాపూర్ :

ఖానాపూర్ లాంటి ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఇలాంటి బేకరీ షాప్ ప్రారంభించడం గొప్ప విషయమని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు.శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో అక్కడి ప్రముఖ వ్యాపారవేత్త శేఖర్ నూతనంగా ఏర్పాటు చేసిన బేకరీ, కేక్ హౌస్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ.. ఖానాపూర్ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో ఇలాంటి బేకరీ షాప్ ప్రారంభించడం సంతోష దాయకమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.