గంటలోనే 10 తులాల బంగారం రికవరీ
డయల్ 112 ఫిర్యాదుపై బుగ్గారం పోలీసుల తక్షణ స్పందన జగిత్యాల/బుగ్గారం,నవంబర్8,(నవగీతం) బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పొరపాటున పోగొట్టుకున్న 10 తులాల బంగారాన్ని డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుపై బుగ్గారం పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు. బుగ్గారం ఎస్ఐ శ్రీకాంత్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సంపత్ (2177) చాకచక్యంగా వ్యవహరించి బంగారాన్ని రికవరీ చేయడంతో బాధితుడు ఊరట చెందాడు. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ తన మరదలి వివాహం నిమిత్తం బొంబాయిలో 10 తులాల బంగారం కొనుగోలు...