గడి పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
నవగీతం,కోరుట్ల: కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డు ఎస్.ఆర్.ఎస్పీ క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే పట్టణ పూర విధులలో ప్రభాత భేరి ర్యాలీ నిర్వహించి, జెండా ఆవిష్కరణ చేశారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ వచ్చి విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ వారి మధ్య నేలపైన కూర్చున్నారు. పిల్లలు వారితో కేరింతలు కొడుతూ ఆనందాలు పంచుకున్నారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు పాఠశాలకు విచ్చేయగా వారికి ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య...