గడి బురుజుల భూములను కాపాడుకుందాం
అక్రమ కబ్జాలపై అఖిలపక్షం గర్జన నవగీతం,కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజుల పరిరక్షణ కోసం అఖిలపక్ష నాయకులు సమరశంఖం పూరించారు. శనివారం పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పురాతన గడి పరివాహక భూముల పరిరక్షణపై విస్తృతంగా చర్చించారు. సుమారు 3 ఎకరాల 21 గుంటల విస్తీర్ణంలో ఉన్న గడి బురుజు గ్రామకంఠం భూమి అక్రమ కబ్జాకు గురవుతుండటంపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వర్గాలు మున్సిపల్ అధికారుల ద్వారా సదరు భూమికి అనుమతులు...