గద్వాల సోమన్న”మమతల కోవెల” పుస్తకావిష్కరణ
నవగీతం,నందవరం : నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత 90వ పుస్తకం"మమతల కోవెల " పుస్తకావిష్కరణ 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అద్దేపల్లి జాన్సన్, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ ఛైర్పర్సన్ యం.గంగాధర్, సర్పంచ్ యస్. లక్ష్మి, వైస్ సర్పంచ్ బి. ప్రభాకర్ మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరగడం విశేషం.