గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసా దిశగా ఏపీఎన్ఆర్టీ కీలక ఆలోచనలు!

ఎన్నారైలకు సామాజిక భద్రత, స్వావలంబన కల్పించే విధానాల రూపకల్పనపై చర్చ విజయవాడ, అక్టోబర్ 21 (నవగీతం): గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) కీలక ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేమూరి రవి, డైరెక్టర్ నాగేంద్రబాబును ఏపీఎన్ఆర్టీ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ ఎం. వాసుదేవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సమస్యలు,...