గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం చేయూత
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన నలుగురు గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల విలువ గల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. అదేవిధంగా జగిత్యాల పట్టణం, రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది ఆడబిడ్డలకు కళ్యాణ...