గుండంపల్లిలో నూతన జమ్మి గద్దె ప్రారంభం
గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య మల్లాపూర్, అక్టోబర్ 21 (నవగీతం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు నూతనంగా నిర్మించిన జమ్మి గద్దెను గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య ప్రారంభించారు. గ్రామ వికాస కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిర్మాణానికి సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య దాతగా వ్యవహరించారు. గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో జమ్మి గద్దెను నిర్మించడంతోపాటు, జమ్మి చెట్టును నాటి అందుబాటులోకి...