గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ మృతి

శివప్రసాద్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంతాపం కుటుంబానికి అండగా ఉంటామని భరోసా నవగీతం,పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సీనియర్ రిపోర్టర్ బాలే శివ ప్రసాద్ (45) ఆకస్మిక మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.మండలంలోని ఉషన్నపల్లె గ్రామానికి చెందిన ఆయన ఆదివారం తెల్లవారుజామున నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే శివప్రసాద్ తుదిశ్వాస విడిచారు. కాగా మరణానికి కేవలం ఒకరోజు ముందు ఆయన స్థానికంగా జరిగిన ఒక క్రికెట్ టోర్నమెంట్‌ను ఉత్సాహంగా ప్రారంభించి, స్నేహితులతో సరదాగా గడపడం గమనార్హం.అంతలోనే...