గెలుపు గుర్రాలకే టిఆర్‌పి టికెట్లు
కత్తెర గుర్తుతో మున్సిపల్ ఎన్నికల బరిలోకి అభ్యర్థులు టిఆర్‌పి సీనియర్ నాయకుడు గుండవేణ స్వామి నవగీతం,పెద్దపల్లి: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పెద్దపల్లి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు గుండవేణ స్వామి ప్రకటించారు.జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మంథని,పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలోని అన్ని కార్పొరేటర్ మరియు కౌన్సిలర్ స్థానాలకు గెలుపు గుర్రాలకే పార్టీ బి-ఫారాలు అందజేస్తుందని, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన స్పష్టం...