గొర్రెపల్లి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

మల్లాపూర్,ఆగస్టు8,(నవగీతం)మండలంలోని గొర్రెపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా బోనాల వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఏలేటి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ తోట రాజకుమార్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు వాటి ప్రాధాన్యతను తెలియజేయడం అభినందనీయమన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.