navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 3:55 pm Digital Edition : NAVAGEETAM

గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం.. గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి

మల్లాపూర్, ఆగస్టు 2 (నవగీతం): మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపూర్ గ్రామ శివారులో గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలి వయస్సు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె నావీ బ్లూ రంగు డిజైన్ ఉన్న టాప్, పసుపు రంగు ప్యాంట్ ధరించి ఉంది. చేతులకు ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులు ఉండగా, కుడి చేతిపై “అమ్మ” అని టాటూ కనిపించినట్లు వెల్లడించారు.మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా ఆమెను గుర్తించగలిగిన వారు వెంటనే మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్:ఏ. అనిల్ (ఎస్‌ఐ) – 8712656796