గోదావరి పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రాబోయే గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పుష్కరాలు జరిగే ప్రాంతాల పోలీస్ స్టేషన్ల ఎస్‌.ఐలు, సంబంధిత సి.ఐలు,డి.ఎస్‌.పి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్ శాఖ తరఫున చేపట్టాల్సిన సమగ్ర భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ & పార్కింగ్ నియంత్రణ, సీసీటీవీ కెమెరాల విస్తృత ఏర్పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు, విఐపీ ఘాట్‌లు, పుష్కర ఘాట్‌లు, తాత్కాలిక స్నాన ఘాట్‌ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా...