గోధుర్ మాస్టర్ కాన్వెంట్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు28,(నవగీతం): ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మాస్టర్ కాన్వెంట్ స్కూల్‌లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు,అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ పండుగ నేపథ్యం, దాని విశిష్టతతో పాటు పురాణాల్లోని రక్షాబంధన్‌కు సంబంధించిన కథలను పాఠశాల ప్రిన్సిపాల్ సాత్పాడి పురుషోత్తం విద్యార్థులకు వివరించారు. పండుగల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల విలువలను విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన...