గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, పర్యావరణ అనుమతులు, కాలువల పనులు, సవరించిన అంచనాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం హైదరాబాద్,అక్టోబర్03,(నవగీతం) గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం ఆర్ అండ్ ఆర్ , పర్యావరణ అనుమతులు, సవరించిన అంచనాలు, కాలువల పనులు, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్....