గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన యువ బాక్సర్
ఆర్థిక ఇబ్బందుల్లోనూ ప్రతిభతో మెరిసిన మోక్షిత్ అంతర్జాతీయ లక్ష్యానికి నిత్య సాయి ట్రస్ట్ భరోసా నవగీతం ,మెట్ పల్లి ప్రతినిధి: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామానికి చెందిన గుండ రమేష్–మమతల కుమారుడు మోక్షిత్ బాక్సింగ్ విభాగంలో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతను ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఎలాంటి ప్రొఫెషనల్ కోచింగ్ లేకుండానే స్వయంగా సాధన చేస్తూ బాక్సింగ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన అతని ప్రయాణం జాతీయ స్థాయికి చేరుకుంది....