గ్రామపాలనలో సర్పంచ్ ల పాత్ర, బాధ్యతల పై అవగాహన

నవగీతం,ఖమ్మం ఖమ్మం నగరంలోని టిటిడిసీ సమావేశ మందిరం లో జిల్లాలో నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచులకు నిర్వహించే శిక్షణ తరగతులలో సోమవారం అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని గ్రామపాలనలో సర్పంచ్ ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అందించవలసిన సేవలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో ప్రజల నమ్మకాన్ని పొంది ఎన్నికైన సందర్భంగా ముందుగా సర్పంచ్ లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు