గ్రామాల్లో పశువుల దొంగల ముఠా కలకలం!
పోలీసులను ఆశ్రయించిన బాధితులు నవగీతం తల్లాడ ప్రతినిధి: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం, గాంధీనగర్ గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా పాడి గేదెలు (బర్రెలు) దొంగతనానికి గురవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయల విలువైన పాలిచ్చే గేదెలు మాయమవడంతో తాము జీవనాధారం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఇటీవల సోములగడ్డ స్పీడ్ బ్రేకర్ వద్ద ఓ వ్యాన్ లో గేదెలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక గేదె కింద పడిపోయింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ...