గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 16 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు.ప్రతి ఫిర్యాదును న్యాయబద్ధంగా, పారదర్శకంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో పరిష్కరించగల సమస్యలను ఆలస్యం...