navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 4:04 am Digital Edition : NAVAGEETAM

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 మంది  అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని తెలిపారు.