ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మెట్ పల్లి డివిజన్ కేంద్రం అయినా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యక్షులు అయిటి సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సముచితంగా రాణిస్తున్న మరింత ముందుకు రావాలని అభిలాషించారు. మెట్ పల్లి మండల విద్యాధికారి కొండా కనకతర మాట్లాడుతూ మహిళలు బహుళ రంగాలలో విశిష్టంగా రాణిస్తున్నప్పటికీ మరింత ఆదర్శవంతమైన పాత్ర సమాజంలో పోషించాలని తెలిపారు. రిటైర్డ్...