navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 2:31 pm Digital Edition : NAVAGEETAM

ఘనంగా గ్రేస్ ప్రార్థనా మందిరం వార్షికోత్సవం

వృద్ధులకు మానసిక వికలాంగులకు  అల్పాహారం వితరణ

నవగీతం, వైరా

అల్పాహారం మహోపకారమని పాస్టర్ మోదుగు వినోద్ కుమార్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో గల గ్రేస్ ప్రార్ధన మందిరం 16వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.దేవుని చిత్తము జరిగించు వారు నిరంతరము నిలుస్తారని దైవ సేవకులు తెలియజేశారు.అనంతరం మండల పరిధిలోని గొల్లపూడి గ్రామంలో గల వృద్ధులకు, బోనకల్ లో గల వృద్ధులకు, శాంతి నిలయంలో గల మానసిక వికలాంగులకు అల్పాహారం వితరణగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వృద్ధుల యొక్క ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వృద్ధులను సొంత బిడ్డలుగా చూసుకోవాలని నిర్వాహకులను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ ప్రార్ధన మందిరం పాలడుగు సభ్యులు పాల్గొన్నారు.