navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా చింతోజు నాగేశ్వరరావు సీతా దంపతుల వివాహ వేడుకలు

వార్షికోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

నవగీతం:వైరా ప్రతినిధి:

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వైరాలోని సాయిబాబా మందిరంలో జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు సీతా దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు క్లబ్ సభ్యులు మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి గోశాలకు క్లబ్ అధ్యక్షులు వై బుచ్చి రామారావు ఆధ్వర్యంలో వరిగడ్డిని నాలుగు ఫ్యాన్ లను వాటర్ పైపును మరియు పట్టాను పదివేల రూపాయలతో ఆయన అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాప మురళీకృష్ణ మాట్లాడుతూ సేవే మార్గం ప్రేమే లక్ష్యంగా లయన్స్ సభ్యులందరూ అంకితభావంతో పని చేయడం గర్వకారణమని అన్నారు ప్రతి లయన్స్ సభ్యులు సేవే పరమావధిగా సమాజంలో కార్యక్రమాలు నిర్వహించి మననలు పొందాలని సూచించారు. అనంతరం చింతోజు నాగేశ్వరరావు సీతా దంపతులు కేక్ కటింగ్ చేసారు. అనంతరం క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు రీజియన్ సెక్రెటరీ పెనుగొండ ఉపేందర్ రావ్ జోన్ చైర్మన్ తోటకూర శ్రీకాంత్ (డిజి)మహిళ కోఆర్డినేటర్ మాదినేని సునీత ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ చింతలపూడి వెంకటేశ్వరరావు క్లబ్ సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు జిల్లా కమిటీ సభ్యులు నూకల శ్రీనివాసరావు క్లబ్ సభ్యులు కన్యదారి అనుమాయమ్మ తిరుపతి శ్రీనివాసరావు మాదినేని గంగవరపు కిషన్ రాయి దుర్గాప్రసాద్ కొల్లా రాంబాబు మరికంటి రాంగోపాల్ అబ్బూరి రమేష్ కొమిరిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు