ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలోని విజ్‌డమ్ విద్యాభారతి విద్యాసంస్థల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్‌కు సంబంధించిన వివిధ రకాల ప్రదర్శనలు, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు.సైన్స్ డే పురస్కరించుకొని ప్రముఖ శాస్త్రవేత్త సి . వి . రామన్ గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్.తమిళనాడులో జన్మించిన ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర అయ్యర్, పార్వతీ అమ్మాల్. కృషి, పట్టుదలతో శాస్త్ర రంగంలో విశిష్ట స్థానం సంపాదించిన...