ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలాలంకరణ
నవగీతం,కోరుట్ల ప్రతినిధి: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక తహసీల్ చౌరస్తాలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 'వీక్లీ గార్లాండింగ్' (వారపు పూలమాలాలంకరణ) కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ (16వ వార్డు) పొట్ట సురేందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్, అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారని, ఆయన పడిన కష్టాలు...