navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 9:02 pm Digital Edition : NAVAGEETAM

ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం లో మేజర్ గ్రామ పంచాయతీ లో పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ..పంచాయతీ రాజ్ సంస్థలకు  రాజ్యాంగ హోదాను కల్పిస్తూ, 1993లో ఇదే రోజున అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ను స్మరించుకోవడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు . 2010లో మొదటిసారిగా జరుపుకున్న ఈ దినోత్సవం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణను మరియు క్షేత్రస్థాయి సాధికారతను ప్రోత్సహిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సోమ రెడ్డి,వార్డు సభ్యులు ముష్కరి రమేష్,కొంపెల్లి రాకేష్, భుక్యా శేఖర్, అల్లె లత,ఏనుగు లక్ష్మి-వెంకట్ రెడ్డి, అరికుప్పల చిన్న రాజం,ఎనుగంటి నరేష్,ముత్యాల గంగారాజం, ఆడెపు జ్ఞానేశ్వరి, ముద్దం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.