ఘనంగా ప్రారంభమైన ‘సర్కారు బడి’ పాట షూటింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడమే లక్ష్యం మల్లాపూర్, అక్టోబర్3,(నవగీతం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో సోమవారం లింగంపల్లి నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు బడి’ పాట షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య క్లాప్ కొట్టి షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాట దర్శకుడు లింగంపల్లి నరేష్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో ఈ...