ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
వెంకట్రావు పేట్ లో నివాళులర్పిస్తున్న పంచాయతీ పాలకవర్గం నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కనుముల వెంకటేష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త రాజకీయవేత్త బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన...