ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
భీమారం నవంబర్ 8,(నవగీతం): భీమరం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి మల్లేశం, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి...