ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మల్లాపూర్,ఆగస్టు 20 (నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి,పుండ్ర లక్ష్మారెడ్డి, మిట్టపల్లి జీవన్ రెడ్డి, కోటగిరి ఆనంద్ గౌడ్, మరిపెళ్లి మల్లయ్య, బాజోజి సత్యనారాయణ,...