navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 6:15 pm Digital Edition : NAVAGEETAM

ఘనంగా లక్ష్మి వెంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు జువ్వాడి కృష్ణారావు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం రేగుంట లో ఆదివారం లక్ష్మి వెంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు పాల్గొని స్వామి అమ్మవారలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్బంగా గ్రామ అభివృద్ధి కమిటీ పక్షాన ఆలయ అర్చకులు కృష్ణారావు ను ఘనంగా సన్మానించారు  అన్నప్రసాద వితరణ నిర్వహించారు కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ తీట్ల లహరి రాజేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపిటీసీ రాజోజీ సదానందచారీ ఏనుగు రాజారెడ్డి మిట్టపెళ్ళి రాజేశ్వర్ రెడ్డి బొమ్మేన మహేష్ నల్ల రాజేశం బండారు రామచంద్రం ముడంపెళ్లి శేఖర్ జలంధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు