ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం
నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం ఆలయ వార్షికోత్సవాన్ని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమ అశ్విన్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకాలు,అలంకరణ అనంతరం ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు, అర్చనలు చేపట్టారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబును మండల ఆర్యవైశ్య సంఘం తరఫున సన్మానించారు.ఈకార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమ అశ్విన్ కుమార్,ప్రధాన కార్యదర్శి చింత...