navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 9:31 pm Digital Edition : NAVAGEETAM

ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర

నవగీతం,మల్లాపూర్ :

మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దళ్, హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో గురువారం జయంతి వేడుకల అనంతరం వీర హనుమాన్ విజయ యాత్ర అత్యంత ఘనంగా జరిగింది. హనుమాన్ దీక్ష స్వాములు హిందూ బంధువులు మహిళలు మంగళ హారతులతో విజయ యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ యాత్రలో సర్పంచ్ పద్మ నరసయ్య, గుయ్య శ్రీశైల మల్లేష్, గోవికారి మహేష్, వాసు,మల్లేష్, స్వామి, రమేష్, మహిళలు, హనుమాన్ దీక్ష స్వాములు, బజరంగ్ దళ్ హిందూ బంధువులు పాల్గొన్నారు.