ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు
బోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు జగిత్యాలలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని, సమాజంలో ఐక్యత, సేవా భావం, నైతిక విలువలను పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని...