చదువుకో తెలంగాణ- బాగా చదవండి మిషన్ 10వ తరగతి పోస్టర్ ఆవిష్కరణ

నేటి బాలలే రేపటి పౌరులు - బ్రాంచ్ మేనేజర్ పోతుగంటి నరేష్ నవగీతం,మల్లాపూర్: శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన “చదువుకో తెలంగాణ - బాగా చదవండి-మిషన్ 10వ తరగతి” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మల్లాపూర్ మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కేతిరి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మెట్‌పల్లి బ్రాంచ్ మేనేజర్ పోతుగంటి నరేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రతిభా...