హర్షం వ్యక్తం చేసిన నాయకులు
మల్లాపూర్,అక్టోబర్13,(నవగీతం)
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లాల రాజేష్‌కు మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, మైస రఘుకు యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పదవులు దక్కడం పట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా శాలువా తో సన్మానించారు
చిన్న వయసు నుంచే పార్టీ కోసం కష్టపడుతూ, ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులకు పదవులు లభించడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.
గతంలో గ్రామ శాఖ స్థాయి నుంచి మండల స్థాయికి ఎదుగుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు. జువ్వాడి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ, గ్రామస్థాయిలో యువజన నాయకులను ప్రోత్సహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. యువ నాయకులకు పదవులు దక్కడం వల్ల గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, మాజీ సర్పంచ్ కడకుంట్ల సాయి, మాజీ ఉప సర్పంచ్ గడ్డం లింగారెడ్డి, వార్డు సభ్యులు మట్టా రాములు, ఇట్టేది శంకర్, ఉప్పులేటి లక్ష్మీనారాయణ, పబ్బతి రాజేష్, సీనియర్ నాయకులు కంది బుచ్చిరెడ్డి, కొత్తపల్లి రాజారెడ్డి, రాజేందర్ రెడ్డి, నరవేణి జనార్ధన్, దాసరి రాజేశం, ఎంచురాల చిన్నారెడ్డి, అచ్చ రఘుపతి, కంది హన్మంతరెడ్డి, బోయిన కాశీరామ్, పబ్బతి శేఖర్, నరవేణి రమేష్, మ్యకల ఉషాలు, సంపతి చిన్న అంజన్న తదితరులు పాల్గొన్నారు.