చిన్నారి జ్ఞాపకాలకు కన్నీటి నివాళి –
గురువుల నుంచి ఆర్థిక చేయూత నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన 6వ తరగతి విద్యార్థిని రోడ్డ వైష్ణవి మృతితో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిన విషయం విదితమే. చిన్నారి అకస్మాత్తు మృతి పాఠశాల వాతావరణాన్నే కమ్మేసింది.తను చదువుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ విషాదాన్ని తట్టుకోలేక, తమవంతు బాధ్యతగా ముందుకు వచ్చారు. ఉపాధ్యాయులందరు స్వచ్ఛందంగా కలిసి రూ.13,150/-ను సేకరించి వైష్ణవి కుటుంబ సభ్యులకు శనివారం రోజున అందజేశారు....